First Night: శోభనం కావాలంటే ఆ పని చేయాల్సిందే..ఫస్ట్ నైట్ రోజే వరుడికి షాకిచ్చిన వధువు

First Night: ఉత్తరప్రదేశ్‌లో మేలిముసుగు తీయడానికి 90 లక్షలు డిమాండ్ చేసిన వధువు, డబ్బు ఇవ్వలేదని గ్యాస్ పైప్‌లైన్ పేల్చి వరుడి కుటుంబాన్ని చంపే ప్రయత్నం చేసింది.

Naresh.k
Published on: 15 April 2026 9:36 AM IST
First Night
X

First Night: శోభనం కావాలంటే ఆ పని చేయాల్సిందే..ఫస్ట్ నైట్ రోజే వరుడికి షాకిచ్చిన వధువు

Agra Bride: పెళ్లి అంటే నూరేళ్ల పంట.. ఏడడుగుల బంధం ఏడు జన్మల సాక్షి అంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఒక పెళ్లి మాత్రం నూరేళ్ల మంటగా మారింది. పవిత్రమైన పెళ్లి పీటల మీద కూర్చున్న వధువు, మొదటి రాత్రి వేళ తన అసలు రూపాన్ని బయటపెట్టింది. మేలిముసుగు తీయాలంటే లక్షలు కావాలని డిమాండ్ చేసి, చివరకు ఆ ఇంటినే వల్లకాడు చేసేందుకు ప్రయత్నించిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.

ట్విస్ట్ అదిరింది.. కానీ భయంకరంగా!

ఆగ్రాకు చెందిన యువకుడికి, కల్పన అనే యువతికి గతేడాది ఏప్రిల్ 29న వైభవంగా వివాహం జరిగింది. బంధుమిత్రుల కోలాహలం, మంగళ వాయిద్యాల మధ్య పెళ్లి ముగిసింది. శోభనం గదిలోకి అడుగుపెట్టిన వరుడు, తన భార్యతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశపడ్డాడు. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. వధువు కల్పన తన ముఖంపై ఉన్న మేలిముసుగు తీయడానికి ఏకంగా రూ. 90 లక్షల నగదు కావాలని భర్తను డిమాండ్ చేసింది. అంత పెద్ద మొత్తం తన దగ్గర లేదని, అది అసాధ్యమని వరుడు చెప్పడంతో.. డబ్బు లేనిదే శోభనం లేదు అంటూ మరుసటి రోజే నగలతో సహా పుట్టింటికి చెక్కేసింది.

ఏడాది తర్వాత గ్యాస్ పైప్‌లైన్ పేల్చి..

డబ్బు పిచ్చితో మొదలైన ఈ గొడవ ఏడాది గడిచినా చల్లారలేదు. వధువు కుటుంబ సభ్యులు వాట్సాప్ ద్వారా వరుడికి బెదిరింపులు పంపడం మొదలుపెట్టారు. అడిగిన డబ్బు ఇవ్వకపోతే సజీవ దహనం చేస్తామని హెచ్చరించారు. చెప్పినట్లుగానే, ఈ ఏడాది మార్చి 26న వధువు తండ్రి, సోదరుడు వరుడి ఇంటికి వచ్చి గొడవకు దిగారు.కోపంతో రగిలిపోయిన వారు, ఆ ఇంట్లో ఉన్న పీఎన్‌జీ గ్యాస్ పైప్‌లైన్‌ను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఇల్లంతా మంటలు వ్యాపించడంతో వరుడు, అతడి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది కానీ, ఆ ఇల్లు చిన్నాభిన్నమైంది.

న్యాయస్థానం జోక్యంతో ఎఫ్ఐఆర్

వధువు తరఫు వారు పలుకుబడి ఉన్నవారు కావడంతో, స్థానిక పోలీసులు మొదట కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం తీవ్రంగా స్పందించి ఆదేశాలు జారీ చేయడంతో, ఆగ్రా పోలీసులు ఇప్పుడు వధువు కల్పన, ఆమె తండ్రి, సోదరుడిపై హత్యాయత్నం, బలవంతపు వసూళ్లు కింద కేసులు నమోదు చేశారు.

Naresh.k

Naresh.k

Next Story