Etapaka: ఎటపాక గోదావరిలో మునిగి ఐదుగురు మృతి
Etapaka: పోలవరం జిల్లా ఎటపాక మండలంలో విషాదం. చేపల వేటకు వెళ్లి గోదావరి నదిలో గల్లంతై ఐదుగురు మృతి. గొమ్ముకొత్తగూడెం గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు.
Etapaka: ఎటపాక గోదావరిలో మునిగి ఐదుగురు మృతి
ఎటపాక: పోలవరం జిల్లా ఎటపాక మండలం టిపరపెంటివీడు పంచాయతీ గొల్లగూడెం గ్రామం వద్ద గల గోదావరి వద్దకు చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి చెందారు.
గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన 11 మంది చేపల వేటకు గొల్లగూడెం వద్ద గల గోదావరి వద్దకు వెళ్లారు. ఈ సమయంలో బసిబోయిన బాలరాజు(38), ఊయిక రమేష్(38), తుర్రం భారతి (40), ఊయిక లక్ష్మి (37),ఊయిక సుశీల (37) లు గోదావరిలో గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న స్థానికులు, పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఐదుగురు కోసం గాలించగా వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. గొమ్ముకొత్తగూడానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story




