Antarvedi: విద్యుత్ ఘాతంతో పొక్లెయిన్ డ్రైవర్ దుర్మరణం!
Antarvedi: కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఆక్వా చెరువు పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో పొక్లెయిన్ డ్రైవర్ రమేష్ (41) మృతి. కేసు నమోదు చేసిన సఖినేటిపల్లి పోలీసులు.
Antarvedi: విద్యుత్ ఘాతంతో పొక్లెయిన్ డ్రైవర్ దుర్మరణం!
Antarvedi: డాక్టర్. బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది దేవస్థానం గ్రామ పరిధిలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఆక్వా చెరువులకు సంబంధించిన పనులు నిర్వహించేందుకు రాజమండ్రి పరిసర ప్రాంతమైన పిడింగొయ్యి గ్రామం నుంచి వచ్చిన పొక్లెయిన్ డ్రైవర్ కంచరాన రమేష్ (41) విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల కథనం మేరకు, ఓ భూస్వామికి చెందిన ఆక్వా చెరువులో పనులు నిర్వహిస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్ నుంచి చెరువులకు విద్యుత్ సరఫరా కోసం భూమిలో పూడ్చిన విద్యుత్ కేబుల్ పొక్లెయిన్ బరువుకు నలిగిపోయి షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ఘటనలో రమేష్ తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై అతని సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.




