Atchampeta: సీఐ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య సెల్ఫీ వీడియో తీవ్ర కలకలం!

Atchampeta: పల్నాడు జిల్లా అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు వేధింపులు తాళలేక నాగరాజు ఆత్మహత్య. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో విడుదల. స్థానికంగా తీవ్ర ఆగ్రహం.

VENKATESWARA RAO,	PEDAKURAPADU
Published on: 25 July 2026 1:31 PM IST
Atchampeta
X

Atchampeta: సీఐ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య సెల్ఫీ వీడియో తీవ్ర కలకలం!

Atchampeta: అచ్చెంపేట సి.ఐ శ్రీనివాసరావు వేధింపులకు, నిర్లక్ష్యానికి బలైన నిండుప్రాణం.

ఆత్మహత్యకు ముందు సి.ఐ శ్రీనివాసరావు వేధిస్తున్నాడంటూ సెల్ఫీ వీడియో విడుదలచేసిన బాధితుడు నాగరాజు.

పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న నాగరాజు.

హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందిన నాగరాజు.

తనతో పాటు తన తండ్రిని గ్రామంలోని కొందరు వ్యక్తులు తీవ్రంగా కొట్టారంటూ పదిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన నాగరాజు.

తన పైన తన పిల్లల పైన రివర్స్ కేస్ పెడతానంటూ సి.ఐ శ్రీనివాసరావు బెదిరించాడంటూ ఆరోపించిన నాగరాజు.

సి.ఐ తో పాటు స్టేషన్ లో సురెష్ అనే కానిస్టేబుల్ పైనా తీవ్రమైన ఆరోపణలు చేసిన నాగరాజు.

అచ్చంపేట పోలీసుల పనితీరు పై గతంలో కూడా అనేక ఆరోపణలు.

లంచాల డబ్బు సైతం ఫోన్ పే, గూగుల్ పే ల ద్వారా సైతం వసూలు చేస్తున్న వైనం.

పోలీసు అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆరోపణలు.

VENKATESWARA RAO,	PEDAKURAPADU

VENKATESWARA RAO, PEDAKURAPADU

Next Story