Bodhan: హైటెక్ బార్‌లో కస్టమర్‌పై దాడి తీవ్రంగా గాయపడిన రుద్రూర్ వాసి!

Bodhan: బోధన్ హైటెక్ బార్‌లో బైక్ తాళం కోసం అడిగినందుకు నారాగౌడ్‌పై నిర్వాహకుడి అకారణ దాడి.

K RAVI, BODHAN
Published on: 20 July 2026 11:00 AM IST
Bodhan
X

Bodhan: హైటెక్ బార్‌లో కస్టమర్‌పై దాడి తీవ్రంగా గాయపడిన రుద్రూర్ వాసి!

Bodhan: బోధన్ పట్టణం లోని హై టెక్ బార్ లో వ్యక్తి పై దాడి జరిగిన ఘటన పై పోలీసులకు పిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం రుద్రూర్ గ్రామానికి చెందిన నారాగౌడ్ శనివారం మధ్యాహ్నం పని నిమిత్తం బోధన్ వెళ్ళాడు. పని ముగించుకుని తిరిగి వచ్చే క్రమంలో సమీపంలో ఉన్న హైటేక్ బార్ రెస్టారెంట్ కు వెళ్ళాడు. అక్కడ కొంత మద్యం సేవించిన అనంతరం ఇంటికి వెళ్లే సమయం లో తన ద్విచక్ర వాహనం కు సంబందించిన తాళం కనపడకుండా పోవడం తో బార్ నిర్వాహకులనుకౌంటర్ వద్దకు వెళ్లి అడిగాడు.

ఇంతలోని బార్ నిర్వాహకుడు కౌటర్ పై నుండి వచ్చి తనను అకారణం గా దాడి చేయడం తో అక్కడే నాలుగు గంటల పాటు అపస్మా రక స్థితిలో పడి ఉన్నాడు. రాత్రి వరకు నారగౌడ్ ఇంటికి తిరిగి రాక పోవడం తో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు విషయంతెలుసుకున్న రాత్రి 8 గంటలకు వెళ్లి చూడగా బార్ లో నారాగౌడ్ కనిపించడం తో బార్ నిర్వహ కుడిని నిలదీశారు. నారాగౌడ్ పై చేతికి ఉన్న కడియం తో డాడీ చేయడం తో కంటి గుడ్డు పై తీవ్రంగా గాయాలు కావడం తో చికిత్స నిమిత్తం అస్పత్రి కి తరలించారు.

తమ వ్యక్తి ఏదైనా తప్పు చేసినట్లయితే కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకురావాలి గాని విచక్షణ రైతంగా దాడి చేయడమేంటని మండిపడ్డారు. బార్లో వస్తువు కనిపించకుండా పోవడం పై ప్రశ్నించడంలో తప్పేంటి అని దీనికే రౌడీ మూకలాగా దాడి చేయడమేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.బోధన్ పట్టణ పోలీసులకు పిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులుపేర్కొన్నారు. ఈ ఈ విషయమై పట్టణ ఎస్ఎస్ఓ వెంకట్ నారాయణ వివరణ కోరగా విచారణ చేపడతామని సమాధానం ఇచ్చారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story