Badangpet: ఘోర రోడ్డు ప్రమాదం - ట్రాక్టర్ కిందపడి మహిళ దుర్మరణం!

Badangpet: మీర్‌పేట్ పరిధిలోని బడంగ్‌పేట్‌లో విషాదం. స్కూటీ అదుపుతప్పి కిందపడిన మహిళపై నుంచి వెళ్లిన ట్రాక్టర్. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ప్రసన్నలక్ష్మి.

RAHUL, MEERPET
Published on: 29 Sept 2026 11:57 AM IST
Badangpet
X

Badangpet: ఘోర రోడ్డు ప్రమాదం - ట్రాక్టర్ కిందపడి మహిళ దుర్మరణం!

Badangpet: మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయం నుంచి రాజీవ్ గృహకల్పకు వెళ్లే మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాదర్‌గుల్ గ్రామానికి చెందిన ఏనుగు ప్రసన్నలక్ష్మి స్కూటీపై వెళ్తుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి ….

స్కూటీపై వెళ్తున్న ప్రసన్నలక్ష్మి ఎదురుగా వస్తున్న ఆటోలను గమనించి అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది . అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

సమాచారం అందుకున్న మీర్ పెట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET