Chintoor: సీలేరు నదిలో కొట్టుకుపోయి భీమవరం డాక్టర్ మృతి!
Chintoor: చింతూరు ఏజెన్సీ సీలేరు నదిలో విషాదం. డ్యామ్ గేట్లు ఎత్తడంతో పెరిగిన నీటి ఉధృతి.. పర్యాటకానికి వచ్చిన ఏడుగురిలో భీమవరం వైద్యుడు ఉదయ్ కిరణ్ మృతి.
Chintoor: సీలేరు నదిలో కొట్టుకుపోయి భీమవరం డాక్టర్ మృతి!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలోని సీలేరు నదిలో ఓ యువకుడు మృతి చెందాడు.పశ్చిమగోదావరి జిల్లా గణపవరం గ్రామానికి చెందిన 7 గురు యువకులు చింతూరు ఏజెన్సీ లోని ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చారు.పొల్లూరు గ్రామ సమీపంలోని సీలేరు నదిలో స్నానానికి దిగారు.యువకులు స్నానం చేస్తున్న సమయంలో ఎగువ ప్రాంతంలో ఉన్న సీలేరు డ్యాం గేట్లు వదలడంతో అకస్మాత్తుగా నది ప్రవాహం పెరిగింది. నీటి ఉధృతి వలన సీలేరు నదిలో స్నానం చేస్తున్న ఏడుగురు యువకులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుండగా ఆరుగురుని స్థానికులు రక్షించడం జరిగింది.
భీమవరం లో అశోక్ కిడ్నీ సెంటర్లో డాక్టర్ గా చేస్తున్న మహంకాళి ఉదయ్ కిరణ్(23) నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు.గల్లంతైన యువకుడి కోసం మోతుగూడెం పోలీస్ అధికారులు డ్రోన్ సహాయంతో నదిలో వెతికే ప్రయత్నం చేశారు.గల్లంతైన ఉదయ్ కిరణ్ నదిలో మృతి చెందడం గుర్తించారు.తమతో పాటు వచ్చిన ఉదయ్ కిరణ్ మృతి చెందడంతో స్నేహితులు కన్నీటి పర్యంతం అయ్యారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.




