Blackmail : మైనర్‌కు ప్రేమ పేరుతో వల.. నగ్న వీడియో కాల్స్ చేసి బ్లాక్‌మెయిల్..!

Blackmail : గుజరాత్‌కు చెందిన ఓ మైనర్ బాలికను నకిలీ పేరుతో సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని, నగ్న వీడియో కాల్స్ చేయాలని బలవంతపెట్టి, అనంతరం

G Krishna
Published on: 18 July 2026 8:49 AM IST
Blackmail
X

Blackmail

Blackmail : గుజరాత్‌కు చెందిన ఓ మైనర్ బాలికను నకిలీ పేరుతో సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని, నగ్న వీడియో కాల్స్ చేయాలని బలవంతపెట్టి, అనంతరం వాటితో బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన బిట్టూ ఖాన్ అనే వ్యక్తి 'Achat' అనే మెసేజింగ్ యాప్‌లో తన అసలు గుర్తింపును దాచిపెట్టి, 'సోను' అనే పేరుతో 23 ఏళ్ల అవివాహిత యువకుడినని చెప్పి అహ్మదాబాద్ రూరల్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మార్చిలో బాలిక Achat యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా సన్నిహితంగా మాట్లాడడం ప్రారంభించాడు.

నగ్న వీడియో కాల్స్ చేయాలని ఫోర్స్..

కొంతకాలం తర్వాత బాలికపై నగ్న వీడియో కాల్స్ చేయాలని, తనను వ్యక్తిగతంగా కలవాలని, శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 10 రోజుల క్రితం నగ్న వీడియో కాల్ చేయాలని డిమాండ్ చేయగా బాలిక నిరాకరించింది. దీంతో ఆమె వివరాలను సోషల్ మీడియాలో వైరల్ చేసి పరువు తీస్తానంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, బాలిక జీమెయిల్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల పాస్‌వర్డ్‌లను కూడా సంపాదించి, ఆమె అనుమతి లేకుండా వాటిని యాక్సెస్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె మొబైల్ నంబర్‌ను ఇతరులతో కూడా పంచుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

గత రెండు నెలలుగా వీడియో కాల్స్‌లో బట్టలు విప్పాలని నిరంతరం వేధించడంతో పాటు, తన మాట వినకపోతే ఆత్మహత్య చేసుకుని సూసైడ్ నోట్‌లో ఆమె పేరు రాస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో వెల్లడైంది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన బాలిక భయంతో రెండు సార్లు వీడియో కాల్స్‌లో పాల్గొనగా, వాటి రికార్డింగ్‌లతో ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ శారీరక సంబంధానికి కూడా ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు.


నకిలీ ఐడీతో డ్రామాలు..

ఈ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. నిందితుడి పరిచయస్తుడు యూసుఫ్ ద్వారా 'సోను'గా పరిచయం చేసుకున్న వ్యక్తి అసలు పేరు బిట్టూ ఖాన్ అని, అతను ఇప్పటికే వివాహితుడు, ఒక కుమార్తెకు తండ్రి అని బాలికకు తెలిసింది. బాలిక ప్రశ్నించగా, తాను ముస్లింనని, ప్రస్తుతం భార్యతో విడాకుల ప్రక్రియలో ఉన్నానని బిట్టూ ఖాన్ చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తన మతపరమైన గుర్తింపును దాచిపెట్టేందుకు ఆధార్ కార్డులో కేవలం 'బిట్టూ' అనే పేరే ఉందని కూడా చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

దర్యాప్తులో భాగంగా నిందితుడు Achat యాప్ ద్వారా మరో నలుగురు యువతులతో కూడా సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. వారిని కూడా ఇదే విధంగా మోసం చేశాడా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మైనర్ బాలికను మోసం చేయడానికి నిందితుడు ఉద్దేశపూర్వకంగా తన అసలు గుర్తింపును దాచిపెట్టి, తప్పుడు పేరుతో పరిచయం పెంచుకుని, అనంతరం బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story