Chittoor: కుప్పం అటవీ ప్రాంతంలో మృతదేహం కలకలం, హత్యగా పోలీసుల అనుమానం!

Chittoor: చిత్తూరు జిల్లా కుప్పం అటవీ ప్రాంతంలో పాతిపెట్టిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. మృతుడు తమిళనాడుకు చెందిన శశికుమార్‌గా గుర్తింపు.

KUMAR, KUPPAM
Published on: 2 Oct 2026 10:54 AM IST
Chittoor
X

Chittoor: కుప్పం అటవీ ప్రాంతంలో మృతదేహం కలకలం, హత్యగా పోలీసుల అనుమానం!

Chittoor: కుప్పం అడివి ప్రాంతంలో మృతిదేహం కలకలం. పెద్దవంక అటవీ ప్రాంతంలో వ్యక్తి మృతదేహాన్ని పాతిపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. రహదారికి సుమారు 50 అడుగుల దూరంలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు. మృతుడు తమిళనాడు రాష్ట్రం కరంబూరుకు చెందిన శశికుమార్ గా గుర్తింపు.

శశికుమార్ ను హత్య చేసి పాతిపెట్టినట్లు భావిస్తున్న పోలీసులు. 3 రోజులుగా శశికుమార్ అదృశ్యమైనట్లు సమాచారం. మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM