Karimnagar: సొంత తమ్ముడిపైనే కసాయి వేట.. నిందితుడు అరెస్ట్

Karimnagar: కరీంనగర్ కిసాన్ నగర్‌లో ఆస్తి తగాదాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకునే స్థాయికి చేరాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 24 March 2026 9:40 PM IST
Karimnagar
X

Karimnagar: కన్న తమ్ముడిపైనే కసాయి వేట.. నిందితుడు అరెస్ట్

Karimnagar: కరీంనగర్ కిసాన్ నగర్ లో దారుణం సంఘటన జరిగింది. ఆస్తికోసం సొంత అన్నా తమ్ముడు పై దాడి చేసి చంపుతానని బెదిరింపు.

ఇల్లు తన పేరు మీద రాయాలని వేధింపులు..

కిసాన్ నగర్ లో నివసిస్తున్న తుంగ రాజు (35)ఆయన సొంత తమ్ముడుఅయినటువంటి తుంగ రంజిత్ కుమార్ (30 )ని గొడ్డలితో నరికాడు కత్తిలో గొంతు కోసి ఇల్లు నా పేరుపైన రాయాలి లేకుంటే చంపేస్తాను అని కత్తితో విచక్షణారహితంగా పొడిచి పారిపోతుండగా చుట్టుపక్కల వారు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. గతంలో కూడా పలుమార్లు ఆస్తి విషయమే గొడవలు జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే అతన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

బాధితున్ని హాస్పిటల్ కి తరలించిన స్థానికులు..

అన్నదాడిలో గాయపడ్డ తుంగ రంజిత్ కుమార్ ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పారిపోతున్న నిందితుడిని చకచక్యంగా పట్టుకున్న స్థానికులు పోలీసులకు, గాయపడ్డ వ్యక్తిని తరలించేందుకు 108కు సమాచారం అందించారు. అన్న దాడిలో గాయపడ్డ రంజిత్ పరిస్థితి విషమంగానే ఉందని స్థానికులు తెలిపారు.

ఆస్తి గొడవలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి..

చిన్నచిన్న ఆస్తి గొడవలు చిలికి చిలికి గాలి వానగా అయ్యి ప్రాణాలు తీసుకునేంత పరిస్థితికి చేరుకుంటున్నాయి. ఆస్తి విషయాలు డబ్బుల విషయంలో చర్చించుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి గొడవలకు తావు ఉండదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story