Markapuram: మాచర్ల కళాశాల హాస్టల్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య!

Markapuram: బి.చెర్లపల్లికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ప్రసాద్ రెడ్డి మాచర్ల నూటన్స్ కళాశాల హాస్టల్‌లో ఆత్మహత్య.

SREENIVAS YANNAM, MARKAPURAM
Updated on: 25 July 2026 8:00 AM IST
Markapuram
X

Markapuram: మాచర్ల కళాశాల హాస్టల్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య!

Markapuram: మార్కాపురం మండలం పెద్దారవీడు మండల పరిధిలోని బీ. చెర్లపల్లి గ్రామానికి చెందిన వెన్న ప్రసాద్ రెడ్డి (ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి) మాచర్ల మండలం అలుగురాజుపల్లిలోని నూటన్స్ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ గదిలో శుక్రవారం బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

నిరుపేద రైతు కుటుంబానికి చెందిన ప్రసాద్ రెడ్డిని తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలు భరిస్తూ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం వరకు చదివించారు. ఈ ఏడాది చదువు పూర్తయ్యాక ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలుస్తాడని ఆశలు పెట్టుకున్న సమయంలో ఈ దారుణ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారి రోదనలు స్థానికులను కలచివేశాయి.

సమాచారం మేరకు, ప్రసాద్ రెడ్డి నూటన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాలలో ప్లేస్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యోగం వస్తుందో లేదో, తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి, స్నేహితులు ఎగతాళి చేస్తారేమో అనే మానసిక ఒత్తిడితో తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు, తోటి విద్యార్థులు భావిస్తున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story