Bhadrachalam: అతివేగంతో వచ్చి ఢీకొట్టిన ఐరన్ లారీ మహిళ అక్కడికక్కడే మృతి!
Bhadrachalam: భద్రాచలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్‌ను స్థానికులు పోలీసులకు అప్పగించారు.
Bhadrachalam: అతివేగంతో వచ్చి ఢీకొట్టిన ఐరన్ లారీ మహిళ అక్కడికక్కడే మృతి!
Bhadrachalam: భద్రాచలం సెప్టెంబర్ 14- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక ఏషియన్ సినిమా హాల్ ముందు ఒక మహిళ రోడ్డు దాటుతుండగా బ్రిడ్జి వైపు అతివేగముగా వెళుతున్న ఐరన్ లోడ్ లారీ మహిళలను ఢీ కొట్టి 100 మీటర్ల వరకు ఈడ్చుకుని పోయడంతో
ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది అంతేకాకుండా గుర్తుపట్టనంత విధంగా ఆ మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా అయింది.మహిళలు డీ కొట్టి పరారవుతున్న లారీని వెంబడించి డ్రైవర్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.
ఈ ప్రమాద పై విచారణ చేపట్టి డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా బ్రిడ్జి రోడ్ లోని ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికుల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ పెంచాలని తెలిపారు.
చర్ల నుంచి దుమ్ముగూడెం భద్రాచలం మీదుగా హైదరాబాద్ కు ప్రతిరోజు ఇసుక లారీలు అతివేగంగా తిరుగుతున్నాయని జాతీయ రహదారిపై ప్రయాణం చేయాలంటనే ప్రాణాలును అరిచేతులు పెట్టుకుని తిరుగుతున్నామని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం పట్టణంలోని లారీలను చూస్తుంటే పట్టణంలోని ఒక రైలు వెళ్తున్న విధంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు.
ఆ లారీలు వెళ్లే దాకా వేచి ఉండి మరి రోడ్డు దాటే పరిస్థితి నెలకొంది.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భద్రాచలం పట్టణం లోకి వచ్చే లారీలను ఆపి డ్రైవర్ల పై డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి ఒక్కొక్కటి పంపించాలని ప్రజలు కోరుకుంటున్నారు.




