Gudur: గూడూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురికి గాయాలు!
Gudur: నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు.
Gudur: గూడూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురికి గాయాలు!
Gudur: నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రావులపాలెం నుంచి ఐదుగురు నిన్న సాయంత్రం పాండిచ్చేరికికారులో బయలుదేరారు.వీరు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ - చెన్నై జాతీయ రహదారిపై గూడూరు దగ్గర పురిటిపాలెం సమీపానికి వచ్చేసరికి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలోఒకరికి రెండు కాళ్లు విరిగిపోయాయి.మరొకరికి తలకు తీవ్ర గాయమైంది.వీరినీ వెంటనే స్థానికులు వెంటనే హైవే అంబులెన్స్ ఫోన్ చేయగా హైవే అంబులెన్స్ వచ్చి వీరిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు.ప్రమాదం జరిగిన వెంటనే హైవే పెట్రోలింగ్ పోలీసులు, గూడూరు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.హైవేపై ఇష్టానుసారంగా ఆగి ఉన్న లారీల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, లారీ డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




