Minor Assault : కోచ్ ముసుగులో కామాంధుడు.. మైనర్‌పై అఘాయిత్యం.!

Minor Assault : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫుట్‌బాల్ ఆటలో మంచి భవిష్యత్తు అందిస్తానని నమ్మించి, ఒక మైనర్..

G Krishna
Published on: 14 Jun 2026 11:17 AM IST
Minor-Assault
X

Minor-Assault

Minor Assault : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫుట్‌బాల్ ఆటలో మంచి భవిష్యత్తు అందిస్తానని నమ్మించి, ఒక మైనర్ క్రీడాకారిణిపై కోచ్ పదే పదే అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతటితో ఆగకుండా సదరు బాలికను బ్లాక్‌మెయిల్ కూడా చేసినట్లు తేలడంతో, నిందితుడైన 36 ఏళ్ల కోచ్ అభిజిత్ మెండల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం బయటపడింది.

నమ్మించి మోసం చేసిన కోచ్

వసాయ్‌లోని మానిక్‌పూర్ పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలైన 17 ఏళ్ల బాలిక 2023లో అభిజిత్ మెండల్‌కు చెందిన ఫుట్‌బాల్ ట్రైనింగ్ అకాడమీలో చేరింది. మొదట్లో ఆమె నమ్మకాన్ని చూరగొన్న కోచ్, ఫుట్‌బాల్‌ రంగంలో పెద్ద పెద్ద అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపించాడు. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, గత మూడేళ్లుగా ఆమెపై పలుమార్లు లైంగిక వేధింపులకు, అఘాయిత్యానికి పాల్పడినట్లు సదరు బాలిక పోలీసులకు తెలిపింది.

నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఈ వేధింపులు భరించలేక ఆ బాలిక కొద్దిరోజులుగా కోచ్‌కు దూరంగా ఉండటానికి ప్రయత్నించింది. దాంతో కక్షగట్టిన అభిజిత్, ఆమెకు తెలియకుండా తీసిన కొన్ని అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలను చూపించి బెదిరింపులకు దిగాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఆ విజువల్స్‌ను సోషల్ మీడియాలో పెడతానంటూ తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ మానసిక క్షోభను తట్టుకోలేకపోయిన ఆ బాలిక, చివరకు జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పి కన్నీరు పెట్టుకుంది.

పోక్సో (POCSO) యాక్ట్ కింద అరెస్ట్

విషయం తెలిసిన వెంటనే దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుపై మానిక్‌పూర్ పోలీసులు వేగంగా స్పందించి కోచ్ అభిజిత్ మెండల్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై అత్యాచారం, బెదిరింపుల కేసులతో పాటు కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేశారు. కోర్టు నిందితుడికి రిమాండ్ విధించగా, మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story