Wife Kills Husband: భర్త పొట్ట కోసి అవయవాలు సంచిలో పెట్టిన భార్య.. ఆపై టెర్రస్ పైనుంచి..

Wife Kills Husband: కట్టుకున్న భర్తను అత్యంత క్రూరంగా నరికి చంపిన ఓ మహిళ, ఆపై మూడో అంతస్తు పైనుంచి కిందకు దూకింది.

CR Reddy
Published on: 24 Aug 2026 7:35 AM IST
Wife Kills Husband
X

Wife Kills Husband

Wife Kills Husband: హర్యానాలోని కురుక్షేత్ర సమీపంలో ఊహకందని భయంకర సంఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తను అత్యంత క్రూరంగా నరికి చంపిన ఓ మహిళ, ఆపై మూడో అంతస్తు పైనుంచి కిందకు దూకింది. ఈ భయానక దృశ్యాన్ని కళ్లారా చూసిన ఇంటి యజమాని తీవ్ర భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. మూఢనమ్మకాలు, భూతవైద్యం కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా ధాంపూర్ గ్రామానికి చెందిన రాజేష్ తన భార్య విమలా దేవితో కలిసి కొన్నేళ్లుగా కురుక్షేత్రలోని పెహోవా రోడ్ వద్ద అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. రాజేష్ స్థానిక నీటి సరఫరా సంస్థలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ దంపతులకు వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఘటన జరిగిన రోజు సాయంత్రం 5 గంటల సమయంలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం ప్రారంభమైంది.

రక్తపు మడుగులో భయానక దృశ్యం

వారి అరుపులు పెరగడంతో ఏం జరుగుతుందో చూద్దామని ఇంటి యజమాని రింకు పైకి వెళ్లాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆయన నోట మాట రాలేదు. రాజేష్ కడుపు భాగం పూర్తిగా కోసి ఉండగా, రక్తపు మడుగులో జీవచ్ఛవంలా పడి ఉన్నాడు. భర్త శరీరంలో నుంచి తీసిన పేగులను విమల ఒక సంచిలో పెడుతూ కనిపించింది. యజమానిని చూసిన వెంటనే భయాందోళనకు గురైన ఆమె భవనం టెర్రస్ పైనుంచి కిందకు దూకేసింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

ఘటనా స్థలంలో మూడు కత్తులు స్వాధీనం

సమాచారం అందుకున్న వెంటనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురీందర్ సింగ్ బృందం ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి అక్కడకు చేరుకుంది. అక్కడ రక్తంతో నిండి ఉన్న వేర్వేరు పరిమాణాల్లోని మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. రాజేష్ శరీరంలో కొన్ని అవయవాలు కనిపించకపోవడం వల్ల దర్యాప్తు అధికారి కంగుతిన్నారు. విమల గతంలో సంప్రదాయ వైద్యం, భూతవైద్యం పద్ధతులు పాటించేదని, ఆ మూఢనమ్మకాలే ఈ ఘోరానికి కారణమై ఉంటాయని అనుమానిస్తున్నారు.

చికిత్స పొందుతున్న నిందితురాలు

ప్రస్తుతం ఆసుపత్రిలో విమల అత్యవసర విభాగంలో చికిత్స పొందుతోంది. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత వాంగ్మూలం నమోదు చేస్తేనే హత్య వెనుక ఉన్న అసలు కారణాలు బయటపడతాయని అధికారులు చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మూఢనమ్మకాలు, కుటుంబ కలహాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో ఈ ఘటన నిరూపిస్తోంది. పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి ఈ కిరాతక చర్యకు పాల్పడిన విమలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story