Hyderabad: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం..నలుగురు నిందితుల అరెస్ట్

Hyderabad: హైదరాబాద్ కేపీహెచ్‌బీలో డ్రగ్స్ పట్టివేత. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద నలుగురిని అరెస్ట్ చేసిన ఎస్‌ఓటీ పోలీసులు. ఎల్ఎస్డీ, ఎండీఎంఏ స్వాధీనం.

KVD Varma
Published on: 30 March 2026 1:26 PM IST
Hyderabad: హైదరాబాద్ కేపీహెచ్‌బీలో డ్రగ్స్ పట్టివేత.
X

Hyderabad

Hyderabad: హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం భారీగా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో శేర్లింగంపల్లి ఎస్‌ఓటీ (SOT) పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నలుగురు నిందితులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి ఎల్ఎస్డీ స్టాంపులు, ఎండీఎంఏ వంటి ఖరీదైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద శేరిలింగంపల్లి ఎస్ఓటీ పోలీసులు సోడాలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన నలుగురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద నిషిద్ధ మాదకద్రవ్యాలు బయటపడ్డాయి.

నిందితుల నుంచి 9 ఎల్ఎస్డీ (LSD) స్టాంపులు, 4 గ్రాముల ఎండీఎంఏ (MDMA), 150 గ్రాముల ఎండు గంజాయితో పాటు మూడు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మత్తు పదార్థాల విలువ మార్కెట్‌లో లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పట్టుబడిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story