Moinabad: మొయినాబాద్‌లో విషాదం - డెంగ్యూ వ్యాధితో ఇంటర్ విద్యార్థి మృతి!
Moinabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ముర్తుజాగూడకు చెందిన ఇంటర్ విద్యార్థి సామ రిషితా రెడ్డి డెంగ్యూతో మృతి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణం.
Moinabad: మొయినాబాద్‌లో విషాదం - డెంగ్యూ వ్యాధితో ఇంటర్ విద్యార్థి మృతి!
Moinabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ముర్తుజాగూడ గ్రామానికి చెందిన సామ రిషితా రెడ్డి (16) అనే అమ్మాయి డెంగ్యూ వ్యాధితో మృతి చెందింది.
సామ రిష్టారెడ్డి మణికొండ లోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. మూడు రోజుల క్రితం జ్వరం, బాడీపెయిన్స్ ఉన్నాయని మొయినాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ డాక్టర్ ఈ విషయం గమనించి పాపకి డెంగ్యూ వ్యాధి వచ్చింది పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లాలని రిఫర్ చేయడం జరిగింది .
వెంటనే పాపని హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ కి తరలించారు అక్కడ వెళ్లి చూడగా ప్లేట్ లెట్స్ 7000 వరకు పడిపోయినట్లు డాక్టర్లు తెలపడంతో ప్లేట్ లెట్స్ లను ఎక్కియడం జరిగింది. ప్లేట్లెట్లు రికవరీ కాకపోగా లివర్ డ్యామేజ్ అయి కిడ్నీ ఫెయిల్ కావడం తో హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. హార్ట్ స్ట్రోక్ తో రాత్రి 8 గంటల ప్రాంతంలో హాస్పిటల్ లో మృతి చెందింది.




