Endapally: జగిత్యాల జిల్లాలో విషాదం చెరువులో పడి పశువుల కాపరి మృతి!

Endapally: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్‌లో విషాదం. చెరువులో దిగి బురదలో ఇరుక్కుపోయి పశువుల కాపరి ఎలుక లక్ష్మయ్య(60) దుర్మరణం.

RAMESH, DHARMPURI
Published on: 18 July 2026 12:33 PM IST
Endapally
X

Endapally: జగిత్యాల జిల్లాలో విషాదం చెరువులో పడి పశువుల కాపరి మృతి!

Endapally: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఎలుక లక్ష్మయ్య(60) అనే పశువుల కాపరి ప్రమాదవశాత్తు చెరువలో పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఎలుక లక్ష్మయ్య 60 అనే పశువుల కాపరి ప్రతి రోజులాగే పశువులు మేపుటకు వెళ్ళేనాడు. నిన్న కూడా పశువులు మేపుటకు వెళ్లిన లక్ష్మయ్య సాయంత్రం కొన్ని పశువులు చెరువులో ఉండగా వాటిని తీసుకురావడానికి చెరువులోకి వెళ్లిగా చెరువులో ఉన్న బురదలో ఎరుక్కుపోయి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈరోజు ఉదయం చెరువులో మృతదేహం తేలడంతో లస్మయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI

Next Story