Pithapuram: పిఠాపురం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం!
Pithapuram: పిఠాపురం రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో జాతీయ రహదారి 216పై ఘోర ప్రమాదం. ఆటోను ఢీకొట్టిన లారీ. సామర్లకోటకు చెందిన వృద్ధుడు మృతి, ఐదుగురికి గాయాలు.
Pithapuram: పిఠాపురం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం!
Pithapuram: పిఠాపురం పట్టణ శివారు రైల్వే ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో 216 జాతీయ రహదారిపై ఆటోను వెనుక నుండి డీ కొట్టిన లారీ ..
ఒకరు మృతి.. ఐదుగురు కి స్వల్ప గాయాలు..
పిఠాపురం జి.జి.హెచ్ కు తరలింపు..
మృతుడు సామర్లకోట మండలం మాధవ పట్నం కు చెందిన గొల్లవిల్లి అప్పారావు (60) గా గుర్తించిన పోలీసులు..
అప్పారావు కుమార్తె ఇద్దరు మనవళ్లు తో కత్తిపూడి వెళ్లేందుకు సర్పవరం వచ్చి ప్యాసింజర్ ఆటో ఎక్కగా చిత్రాడ దాటిన తరువాత ఆర్.ఓ.బి సమీపంలో వేగంగా వచ్చిన లారీ వెనుక నుండి ఆటోను డీ కొట్టగా ముందు సిటు లో కూర్చున్న అప్పారావు పై ఆటో తిరగబడి మృతి చెందినట్లు తెలిపిన స్థానికులు.
డ్రైవర్ తో పాటు ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు లకు గాయాలు.
108 అంబులెన్స్ లో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు.
Next Story




