Kadapa: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీపైకి దూసుకెళ్లిన లారీ!

Kadapa: కడప జిల్లా వేముల మండలం భూమయ్యగారిపల్లె క్రాస్ వద్ద కూలీలపైకి దూసుకెళ్లిన లారీ. వర్షం కారణంగా చెట్టు కింద ఉన్న మహిళా కూలి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు.

T. AMARNATH, PULIVENDULA
Published on: 23 Sept 2026 3:40 PM IST
Kadapa
X

Kadapa: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీపైకి దూసుకెళ్లిన లారీ!

Kadapa: కడప జిల్లా వేముల మండలం భూమయ్యగారిపల్లె క్రాస్ వద్ద కూలీల పైకి దూసుకు వెళ్లిన లారీ. పొలం పనులు చేస్తున్న రోజు వారి కూలీలు వర్షం పడటంతో చెట్ల కిందికి వెళ్లి ఉండగా కడప నుంచి వస్తున్న లారీ స్పీడ్ బ్రేకర్ ని గమనించకపోవడంతో లారీ అదుపుతప్పి అక్కడే ఉన్న కూలీల పైకి దూసుకుని వెళ్ళింది.

దాదాపు 18 మంది కూలీలు ఉండగా ఐదు మంది కూలీలకు గాయాలు కావడంతో పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో ఒక మహిళ కూలి మృతిచెందగా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం రిమ్స్కు తరలిస్తున్నట్టు డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. వేల్పుల గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణమ్మ మార్గం ఉద్యమంలో మృతి చందగా నలుగురి తీవ్ర గాయాలయ్యాయి.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA