Mangalagiri: మంగళగిరి కొండపై ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు
Mangalagiri: మంగళగిరి పానకాల స్వామి ఆలయ ఘాట్ రోడ్డులో ప్రమాదాలు. లోయలో పడిపోయిన ద్విచక్ర వాహనదారులు. రోడ్డుకు ఇరువైపులా ఫెన్సింగ్ వేయాలని భక్తుల డిమాండ్.
Mangalagiri: మంగళగిరి కొండపై ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు
మంగళగిరి: భక్తితో మొక్కులు చెల్లించి వస్తుంటే ప్రమాదాల బారిన పడుతున్న భక్తులు.గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఎగువ సన్నిధిపై ఉన్న గండాలయ్య స్వామి వారికి మొక్కులు ప్రతి అమావాస్యకి చెల్లిస్తారు.
ప్రతి అమావాస్యకి ఘాట్ రోడ్డు ద్వారా భక్తులు ఘాట్ రోడ్డు ప్రయాణాల్లో పడిపోతున్నారు ప్రమాదవశాత్తు.. ఈరోజు అమావాస్య కావడంతో భక్తులు మొక్కులు చెల్లించుకోవటానికి కొండపై నుండి కిందకి వస్తున్న సమయంలో ఘాట్ రోడ్డు ప్రక్కన ఉన్న లోయలో రెండు ద్విచక్ర వాహనదారులు లోయలో పడిపోగా అక్కడే ఉన్న కొంతమంది భక్తులు వారిని పైకి తీసుకొచ్చి హాస్పటల్కి తీసుకెళ్తూ జరిగింది.
సంబంధిత అధికారులు ఘాట్రోడ్ ఇరుపక్కల ఫెన్సింగ్ వేస్తే ప్రమాదాలు మరియు ప్రాణ నష్టం జరగకుండా చూడవచ్చు అని ప్రజలు తెలియజేస్తున్నారు.




