Hyderabad: ఓయూ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అకాల మరణం!
Hyderabad: ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ మృతి. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం.
Hyderabad: ఓయూ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అకాల మరణం!
Hyderabad: ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ అకాల మరణం పట్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం సంతాపాన్ని ప్రకటించింది. ప్రొఫెసర్ లక్షిణారాయణ ఓయూ కు చేసిన సేవను గుర్తు చేస్తూ... గౌరవ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ మరణం యావత్తు ఓయూ ను దుఃఖ సాగరంలో నింపిందని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మరణం విద్యా రంగానికి మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తీరని లోటు గా పేర్కొన్నారు. ఒక ఉత్తమ అధ్యాపకుడిగా, దూరదృష్టి గల పరిపాలనా అధికారిగా వివిధ హోదాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఆయన అందించిన అంకితభావంతో కూడిన సేవలు అద్భుతమైనవని కొనియాడారు. సంస్థ అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర చెరపలేనిదని, విశ్వవిద్యాలయ చరిత్రలో ఆయన సేవలు ఎల్లప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడారు.
ఆయన చేసిన సేవలను ఉస్మానియా విశ్వవిద్యాలయ రికార్డులలో అధికారికంగా నమోదు చేస్తున్నట్లు తెలిపారు."ఈ అత్యంత కష్టసమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు శ్రేయోభిలాషులకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ, వారికి అండగా ఉంటామని వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ కుమార్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. వైస్ ఛాన్స్ లర్‌తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ బోధన, బోధనేతర సిబ్బంది అంతా కలిసి ఘనంగా నివాళులర్పించారు.




