Hyderabad: మీర్పేట్‌లో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు!

Hyderabad: హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లెలగూడ వద్ద పల్లవి స్కూల్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ. బస్సులో విద్యార్థులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం.

RAHUL, MEERPET
Published on: 28 Sept 2026 3:39 PM IST
Hyderabad
X

Hyderabad: మీర్పేట్‌లో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు!

Hyderabad: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ లలిత నగర్ X రోడ్ వద్ద పల్లవి స్కూల్‌కు చెందిన బస్సు (TG 10 T 1079) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాద సమయంలో బస్సులో స్కూల్ విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో పల్లవి స్కూల్ బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET