Pithapuram: చెల్లిని ఏడిపించొద్దన్నందుకు అన్న దారుణ హత్య!
Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలో వరుస హత్యలు కలకలం. మూలపేటలో గంజాయి మత్తులో యువకుడిపై చాకులతో దాడి, మృతి. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న కొత్తపల్లి పోలీసులు.
Pithapuram: చెల్లిని ఏడిపించొద్దన్నందుకు అన్న దారుణ హత్య!
Pithapuram: గొల్లప్రోలు పట్టణంలో రంగప్ప చెరువు వీధి ఎస్సీ పేటలో హత్యను మరవకముందే కొత్తపల్లి మండలం, మూలపేట గ్రామంలో మరొక వ్యక్తి హత్య.
పెదపూడి మండలం, రామేశ్వరం గ్రామానికి చెందిన మృతుడు రాకేష్ (28) అమ్మమ్మ చనిపోవడంతో అంతిమ కార్యక్రమంలో పాల్గొనేందుకు మూలపేట వచ్చిన వైనం.
మూలపేటలో దుకాణం వద్దకు వెళ్ళిన రాకేష్ చెల్లితో కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించడంతో చోటుచేసుకున్న వివాదం.
తన చెల్లిని కామెంట్ చేశారని అడిగినందుకు రాకేష్ తో వాగ్వాదానికి దిగిన సదరు యువకులు.
అమ్మమ్మ ఖననం కార్యక్రమం చేసేందుకు స్మశాన వాటికకు వెళ్ళిన రాకేష్ పై అదే గ్రామానికి చెందిన వంశీ తో పాటుగా మరో నలుగురు యువకులు పదునైన చాకు తో దాడి చేసిన వైనం.
దాడిలో తీవ్రంగా గాయపడిన రాకేష్ ను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన స్థానికులు.
వైద్య పరీక్షలు అనంతరం రాకేష్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు.
ఐదుగురిని అదుపులోనికి తీసుకున్న కొత్తపల్లి పోలీసులు.
తగిన న్యాయం జరగాలంటూ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర రాకేష్ కుటుంబ సభ్యులు రోధన.




