Alwal: మైనర్ బాలికపై లైంగిక దాడి 8 మందిపై పోక్సో కేసు!

Alwal: మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటనలో అల్వాల్ పోలీసులు ఎనిమిది మందిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PURENDAR, ALWAL
Published on: 14 Sept 2026 7:09 AM IST
Alwal
X

Alwal: మైనర్ బాలికపై లైంగిక దాడి 8 మందిపై పోక్సో కేసు!

Alwal: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు ఎనిమిది మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బొల్లారం ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. పదో తరగతి చదువుతున్న సమయంలో జెర్రీ వరుణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. అనంతరం అతడు బాలికను మత్తులోకి దించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అతడి ద్వారా పరిచయమైన మరో వ్యక్తి కూడా బాలికను మద్యం, సిగరెట్లు, గంజాయి వంటి వాటికి అలవాటు చేసి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై బాలికపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాలిక ప్రవర్తనపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఈ నెల 9న ఆమెను మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనంతరం బొల్లారం రైల్వే స్టేషన్ వద్ద కొందరు వ్యక్తులు పరిచయమై బాలికను మత్తులోకి దించి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మరికొందరు వ్యక్తులు ఆమెను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాలిక తప్పించుకుని ఇంటికి చేరుకున్న అనంతరం కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో కుటుంబ సభ్యులు అల్వాల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా అల్వాల్ పోలీసులు ఎనిమిది మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL