Neredigonda: నేరడిగొండ కుప్టి ఘాట్ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం!

Neredigonda: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టి ఘాట్ వద్ద 44వ జాతీయ రహదారిపై డైమండ్ ట్రావెల్స్ బస్సు ఐచర్ వాహనాన్ని ఢీకొట్టింది.

Pranathi Sri
Published on: 3 Sept 2026 1:33 PM IST
Neredigonda
X

Neredigonda: నేరడిగొండ కుప్టి ఘాట్ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం!

Neredigonda: ​ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టి ఘాట్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న డైమండ్ ట్రావెల్స్ బస్సు, ముందు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది.

​ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగంలో డ్రైవర్ ఖలీమ్ ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఇరుక్కున్న డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

​ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయినట్లుగా తెలుస్తోంది, అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Pranathi Sri

Pranathi Sri