Meerpet: రౌడీషీటర్ సూరి దారుణ హత్య పాత కక్షలే కారణం!
Meerpet: మీర్‌పేట్‌లో నందనవనం సూరి దారుణ హత్య. కళ్లల్లో పెప్పర్ స్ప్రే చల్లి కత్తితో దాడి చేసిన ప్రత్యర్థులు. పాత కక్షలతోనే హత్య చేసినట్లు పోలీసుల నిర్ధారణ.
Meerpet: రౌడీషీటర్ సూరి దారుణ హత్య పాత కక్షలే కారణం!
Meerpet: పాత కక్షల నేపథ్యంలో రౌడీ షీటర్ నందనవనం సూరి హత్యకు గురైన ఘటన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. గతంలో తన భార్యతో పాటు బామ్మర్ది సల్మాన్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సూరి అరెస్టై జైలుకు వెళ్లి అనంతరం విడుదలయ్యాడు. ఇటీవల అతనిపై నగర బహిష్కరణ (ఎక్స్‌టర్న్‌మెంట్) కూడా విధించారు.
సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ కొంతకాలంగా సూరితో సన్నిహితంగా ఉన్నట్లు నటించి, స్నేహితుడి పుట్టినరోజు ఉందని చెప్పి టీకేఆర్ కాలేజ్ సమీపానికి పిలిచి సూరి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి, కత్తితో దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
తీవ్రంగా గాయపడిన సూరిని స్థానికులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి, క్లూస్ టీమ్, మీర్‌పేట్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు.
కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.




