Razole: శివకోటిలో ఘోర ప్రమాదం వృద్ధుడు అక్కడికక్కడే మృతి!

Razole: రాజోలు మండలం శివకోటి జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం. బొలెరో వాహనం ఢీకొని పెచ్చేటి వెంకటేశ్వరరావు (70) మృతి. కేసు నమోదు చేసిన పోలీసులు.

PRABHU, RAZOLE
Published on: 25 July 2026 12:57 PM IST
Razole
X

Razole: శివకోటిలో ఘోర ప్రమాదం వృద్ధుడు అక్కడికక్కడే మృతి!

Razole: రాజోలు మండలం శివకోటిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శివకోటికి చెందిన పెచ్చేటి వెంకటేశ్వరరావు (70) తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్తుండగా, అమలాపురం నుంచి భీమవరం వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనతో శివకోటి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story