Dilsukhnagar: కారును ఢీకొట్టిన డ్యూక్ బైక్, గాల్లోకి ఎగిరిపడ్డ ఇద్దరు!
Dilsukhnagar: కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం వద్ద డ్యూక్ బైక్, టాటా పంచ్ కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా సరూర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Dilsukhnagar: కారును ఢీకొట్టిన డ్యూక్ బైక్, గాల్లోకి ఎగిరిపడ్డ ఇద్దరు!
Dilsukhnagar: డ్యూక్ బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు టాటా పంచ్ కారును వెనుక నుంచి ఢీకొట్టిన సంఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డ్యూక్ బైక్ నంబర్ TS07HM9775, టాటా పంచ్ కారు నంబర్ TG08AK1771గా పోలీసులు గుర్తించారు.
కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం ఎదుట బైక్ కారును బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు కొన్ని అడుగుల మేర గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరి తలలకు గాయాలైనట్లు సమాచారం.
ప్రమాదానికి సంబంధించిన వీడియోలో గాయపడిన ఇద్దరిలో ఒకరు స్థానికులను సహాయం చేయాలని వేడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రమాదానికి అతివేగమే కారణమా, బైక్‌పై ఉన్న వారు మద్యం సేవించారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇద్దరూ మైనర్లా, మేజర్లా అనే విషయాన్ని కూడా నిర్ధారిస్తున్నారు.
గాయపడిన ఇద్దరికీ ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం వారు ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వారిని పిలిపించి విచారించిన తర్వాత ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని సరూర్ నగర్ పోలీసులు తెలిపారు.




