Madanapalle: బైక్ ప్రమాదంలో గాయపడిన వెల్ఫేర్ అసిస్టెంట్!
Madanapalle: పంచాయతీ వెల్ఫేర్ అసిస్టెంట్ సుదర్శన్ బాబును మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి పరామర్శించారు.
Madanapalle: బైక్ ప్రమాదంలో గాయపడిన వెల్ఫేర్ అసిస్టెంట్!
మదనపల్లె: బైక్ ప్రమాదంలో గాయపడిన గ్రామ అధ్యక్షుడు బెల్లం కిట్ట అల్లుడు, వెల్ఫేర్ అసిస్టెంట్ సుదర్శన్ బాబును పరామర్శించిన మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి
మదనపల్లె: పొన్నేటిపాలెం గ్రామ అధ్యక్షుడు బెల్లం కిట్ట అల్లుడు, పొన్నేటిపాలెం పంచాయతీ వెల్ఫేర్ అసిస్టెంట్ సుదర్శన్ బాబు ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో కాలికి గాయపడడంతో మదనపల్లెలోని విశ్వ కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి ఆసుపత్రికి వెళ్లి సుదర్శన్ బాబును పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన సుదర్శన్ బాబు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, త్వరితగతిన కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం సుదర్శన్ బాబుతో మాట్లాడి ధైర్యం చెప్పి, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు. అలాగే గ్రామ అధ్యక్షుడు బెల్లం కిట్టతో మాట్లాడి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.
అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక నాయకులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొని సుదర్శన్ బాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.




