Shamshabad: వాటర్ ట్యాంకర్ బీభత్సం ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Shamshabad: పుప్పాలగూడ టోల్ ప్లాజా వద్ద వాటర్ ట్యాంకర్ బీభత్సం. బైక్‌ను ఢీకొనడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్పెంటర్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. కార్, స్కూటీ ధ్వంసం.

ANJAIAH, SHAMSHABAD
Published on: 22 July 2026 3:59 PM IST
Shamshabad
X

Shamshabad: వాటర్ ట్యాంకర్ బీభత్సం ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

శంషాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివారులలో వాటర్ ట్యాంకర్ బీభత్సం. మోటార్ సైకిల్ ఢీ కొట్టిన వాటర్ ట్యాంకర్ ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు. నిర్లక్ష్యంగా వాటర్ ట్యాంకర్ ను నడిపిన డ్రైవర్ అదే వేగంతో మరో కారును స్కూటీని ఢీకొట్టడంతో వాహనాలు ధ్వంసం.

సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ ను ఢీకొట్టిన వాటర్ ట్యాంకర్ ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బందా జిల్లాకు చెందిన సుశీల్ కుమార్ సురేష్ లు బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్ కు చేరుకుని రాజేంద్రనగర్ సర్కిల్ లక్ష్మిగూడలో నివాసం ఉంటున్నారు.

కార్పెంటర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఇద్దరు నిన్న ఉదయం నగరంలోని హఫీస్ పేటలో గల ఓ అపార్ట్మెంట్ లో పనిచేయడం కోసం వెళ్లారు.

పని ముగించుకొని రాత్రి 8 గంటల సమయంలో తమ మోటార్ సైకిల్ AP 28 DV 3174 పై ఇంటికి తిరిగి వస్తున్నారు. పుప్పాలగూడ టోల్ ప్లాజా సమీపంలోకి రాగానే వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ TS 34 T 1819 ఢీకొట్టడంతో వెనుక కూర్చున్న సుశీల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

బైక్ నడుపుతున్న సురేష్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వాటర్ ట్యాంకర్ ను నడుపుతున్న రంజిత్ సింహ అంతటితో ఆగకుండా అదే వేగంతో ముందుకు వెళ్లి మరొక కారు TS 13 UD 1330 మరియు ఒక స్కూటీ AP 39 KW 6742 లను కూడా ఢీ కొట్టాడు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రహదారులపై నడిపే భారీ వాహనాలు జాగ్రత్తగా నడపాలని ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వాహనదారులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD

Next Story