Shankerpally: కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు బలి
Shankerpally: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లిలో ఘోర విషాదం నెలకొంది.
Shankerpally: కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు బలి
Shankerpally: సుధాకర్, మొండి వాగు రాజు వద్ద వ్యవసాయ కూలీగా పనిచేస్తూ, తన భార్య వసంత మరియు ఇద్దరు పిల్లలు నవ్య, వరుణ్తో కలిసి కొత్తపల్లి గ్రామంలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.
16-07-2026 రాత్రి సుధాకర్‌కు అతని భార్య వసంతతో కుటుంబ కలహం జరిగింది. అనంతరం వసంత (35 సంవత్సరాలు) తన కుమార్తె నవ్య (15 సంవత్సరాలు), కుమారుడు *వరుణ్ (10 సంవత్సరాలు)*తో కలిసి పొలం వద్ద ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
ఈ ఘటనలో వరుణ్ చెట్టు కొమ్మను పట్టుకుని బయటకు రావడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే వసంత మరియు ఆమె కుమార్తె నవ్య బావిలో మునిగి మృతి చెందారు.
మృతుల వివరాలు:
వసంత, భర్త: సుధాకర్, వయస్సు: 35 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయ కూలీ, ప్రస్తుతం: కొత్తపల్లి గ్రామం, శంకర్‌పల్లి మండలం. స్వస్థలం: సంగం గ్రామం, యాలాల మండలం, వికారాబాద్ జిల్లా. నవ్య, తండ్రి: సుధాకర్, వయస్సు: 15 సంవత్సరాలు, 10వ తరగతి విద్యార్థిని.




