Markapur: మార్కాపురం లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య!
Markapur: మార్కాపురం పట్టణంలోని ఓ లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతోనే ప్రాణాలు తీసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.
Markapur: మార్కాపురం లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య!
Markapur: మార్కాపురం పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్వీకేపీ కాలేజీ రోడ్డులోని ఓ లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంటూ యువకుడు సెల్ఫీ వీడియో పోస్ట్ చేసినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.




