Podili: మార్కాపురం-పొదిలి అడ్డరోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం!

Podili: మార్కాపురం-పొదిలి అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం.. బైక్ ఢీకొని ఉపాధ్యాయుడు నూతలపాటి నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలు, ఒంగోలు ఆసుపత్రికి తరలింపు.

MADARVALI, MARKAPURAM
Published on: 12 Sept 2026 6:59 AM IST
Podili
X

Podili: మార్కాపురం-పొదిలి అడ్డరోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం!

Podili: మార్కాపురం–పొదిలి అడ్డరోడ్డు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నూతలపాటి నాగేశ్వరరావును బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆయనను పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM