Nellore: నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ట్రిప్పర్ ఢీకొని ట్రాక్టర్ ధ్వంసం!

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి వద్ద NH-565పై ఘోర రోడ్డు ప్రమాదం. ట్రిప్పర్ ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ తీవ్ర గాయాలు.

Madhav Goud, Nellore
Updated on: 8 Aug 2026 11:05 AM IST
Nellore
X

Nellore: నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ట్రిప్పర్ ఢీకొని ట్రాక్టర్ ధ్వంసం!

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి వద్ద ఎన్‌హెచ్‌-565 హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి గూడూరుకు ట్రాక్టర్‌పై వెళ్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రిప్పర్ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నుజ్జునుజ్జు కాగా, శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే శ్రీనివాసులు మృతి చెందాడని భావించిన ట్రిప్పర్ డ్రైవర్ అనంతసాగరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. అయితే అటుగా వెళ్తున్న కొంతమంది వ్యక్తులు ట్రాక్టర్ డ్రైవర్ శ్రీనివాసులు గాయాలతో ఉండటాన్ని గుర్తించి వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు, శ్రీనివాసులను అనంతసాగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.

ఈ ఘటనపై కలువాయి పోలీసులు వివరాలు సేకరించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story