Tripuranthakam: చెరువులో ఈతకు వెళ్లి 15 ఏళ్ల బాలుడు మృతి!

Tripuranthakam: మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలో విషాదం. చెరువులో ఈతకు వెళ్లిన ఉప్పలపాటి తిరుమలబాబు (15) ప్రమాదవశాత్తు మునిగి మృతి.

Srikanth Singam, Markapur
Published on: 12 July 2026 4:27 PM IST
Tripuranthakam
X

Tripuranthakam: చెరువులో ఈతకు వెళ్లి 15 ఏళ్ల బాలుడు మృతి!

Tripuranthakam: త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉప్పలపాటి తిరుమలబాబు (15) చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు.

చెరువులో ఈత కొడుతుండగా బాలుడు నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టి బాలుడిని బయటకు తీసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

మృతుడు పిచ్చయ్య కుమారుడిగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story