Medchal: డబిల్ పూర్ రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం!

Medchal: మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. ద్విచక్ర వాహనం గుర్తింపు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 22 Sept 2026 12:00 PM IST
Medchal
X

Medchal: డబిల్ పూర్ రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం!

Medchal: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మృతదేహానికి సమీపంలో ఓ ద్విచక్ర వాహనం ఏపీ 23AJ8499 కూడా కనిపించింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం అంబులెన్స్‌కు సమాచారం అందించి, మృతదేహాన్ని తరలించేందుకు చర్యలు చేపట్టారు.

మృతుడి వివరాలు, ఘటనకు గల కారణాలపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL