Nagole: మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం!
Nagole: హైదరాబాద్ నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రతాపసింగారం బ్రిడ్జి వద్ద మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది.
Nagole: మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం!
Nagole: హైదరాబాద్:... నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రతాపసింగారం బ్రిడ్జి సమీపంలో మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది.
శుక్రవారం ఉదయం నదిలో మృతదేహం తేలియాడుతుండగా గమనించిన స్థానికులు వెంటనే నాగోల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మూసీ నది నుంచి బయటకు తీసి పరిశీలించారు.
మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని ప్రాథమికంగా గుర్తించారు. అతడు నీలిరంగు జీన్స్ప్యాంట్, గోధుమరంగు షర్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక నగరంలోని ఇతర ప్రాంతం నుంచి మూసీ ప్రవాహంలో కొట్టుకువచ్చాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు నాగోల్ పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.




