Vikarabad: ఆస్తి తగాదాలతో తండ్రిపై పెట్రోలు పోసి అంటించిన కొడుకు

Vikarabad: వికారాబాద్ జిల్లా రూప్ సింగ్ తండాలో ఆస్తి తగాదాలతో నిద్రిస్తున్న తండ్రి, పిన్నిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుమారుడు. పోలీసుల అదుపులో నిందితుడు

KVD Varma
Published on: 24 March 2026 9:39 AM IST
Vikarabad: వికారాబాద్ జిల్లా రూప్ సింగ్ తండాలో దారుణం
X

Vikarabad

Vikarabad: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో కన్నతండ్రినే హతమార్చేందుకు ప్రయత్నించాడు ఒక దుర్మార్గుడు. జిల్లాలోని పరిగి మండలం రూప్ సింగ్ తండాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి తగాదాలతో ఒక వ్యక్తి తన తండ్రిని, పిన్నిని, ఆమె కొడుకును పెట్రోల్ పోసి చంపేందుకు ప్రయత్నించాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంజి పై కప్పుపై నుంచి పెట్రోల్ ను వారిపై .పోశాడు నిందితుడు. తరువాత మంట వెలిగించాడు. ఎక్కువ మోతాదులో పెట్రోల్ పోయడంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హైదరాబాద్ మెరుగైన చికిత్స కోసం తరలించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తన తండ్రి ఆస్తిలో వాటాకోసం చాలాకాలంగా గొడవ చేస్తున్నాడు. ఆస్తిలో ఎక్కువ వాటా తనకే కావాలని పట్టుపడుతున్నాడు. ఈ క్రమంలో తనకు ఆస్తి రాకుండా తన సవతి తల్లి అడ్డుగా ఉందని కోపం పెంచుకున్నాడు. ఈ తగాదాల నేపథ్యంలోనే తండ్రిని, సవతి తల్లిని, ఆమె కొడుకును హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. అర్థరాత్రి సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా, నిందితుడు గుట్టుచప్పుడు కాకుండా ఇంటి పైకప్పు ఎక్కాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను పైకప్పు పైనుండి కింద నిద్రిస్తున్న తండ్రి, పిన్ని మరియు ఆమె కుమారుడిపై పోశాడు. వారు తేరుకునేలోపే నిప్పు అంటించడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. నిద్రలో ఉన్న వారు మంటల ధాటికి హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు.

వారి కేకలు విన్న స్థానికులు వారిని రక్షించడానికి ప్రయత్నించారు. అయితే, అప్పటికే వారికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని హైదరాబాద్ కు మెరుగైన చికిత్స కోసం తరలించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆస్తి కోసం కన్న కొడుకే తండ్రిని చంపే ప్రయత్నం చేయడం అక్కడి ప్రజల్లో ఆందోళనకు దారితీసింది.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story