Vinukonda: కుటుంబ కలహాల సెగ.. కన్నబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి!

Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.

KAREEMULLA, VINUKONDA
Published on: 14 July 2026 12:52 PM IST
Vinukonda
X

Vinukonda: కుటుంబ కలహాల సెగ.. కన్నబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి!

Vinukonda: కుటుంబ కలహాలు ఓ నిండు సంసారాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో తల్లి తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, విఠంరాజుపల్లి గ్రామానికి చెందిన నక్క భారతి (24) కి సునీల్ రెడ్డితో వివాహమైంది. వీరికి తేజేష్ రెడ్డి (6), హేమనాథ నాగిరెడ్డి (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయని, వాటి కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన భారతి ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ముందుగా తన ఇద్దరు కుమారులకు విషమిచ్చిన ఆమె, అనంతరం తాను కూడా విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఒకే కుటుంబంలో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న బంధువులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు గల అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story