Medchal: అల్వాల్‌లో దారుణం - వ్యాపార నష్టాలతో భర్తను గొడ్డలితో హతమార్చిన భార్య!

Medchal: మేడ్చల్ జిల్లా అల్వాల్ పీఎస్ పరిధిలో తీవ్ర కలకలం. వ్యాపారంలో నష్టాలు రావడంతో భర్త శ్రీనివాస్‌ను గొడ్డలితో నరికి చంపిన భార్య రమాదేవి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.

PURENDAR, ALWAL
Published on: 28 Sept 2026 10:26 AM IST
Medchal
X

Medchal: అల్వాల్‌లో దారుణం - వ్యాపార నష్టాలతో భర్తను గొడ్డలితో హతమార్చిన భార్య!

Medchal: గొడ్డలితో భర్తను హతమార్చిన భార్య.. గోపాల్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన. మచ్చ బొల్లారం లోని పెద్ది ఫార్మారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ రమాదేవి దంపతులు. ఇటీవల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన శ్రీనివాస్.

వ్యాపార విషయంలో నష్టపోవడంతో భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు తెలిపిన పోలీసులు. రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆవేశంతో గొడ్డలితో భర్త శ్రీనివాస్ పై దాడి చేసి హతమార్చిన భార్య రమాదేవి. ఘటనా స్థలికి చేరుకున్న అల్వాల్ పోలీసులు.. హత్యకు గల కారణాలను ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలింపు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL