Markapur: పాము కాటుకు మహిళా రైతు మృతి!
Markapur: మార్కాపురం జిల్లా కొమరోలు మండలం రౌతుపల్లె గ్రామంలో పొలంలో చిక్కుడుకాయలు కోస్తుండగా పాము కాటు వేసి మహిళా రైతు అవిశినేని లక్ష్మీదేవి మృతి చెందింది.
Markapur: పాము కాటుకు మహిళా రైతు మృతి!
Markapur: పాము కాటుకి మహిళా రైతు మృతి చెందిన విషాద సంఘటన మార్కాపురం జిల్లాలో జరిగింది. కొమరోలు మండలం రౌతుపల్లె గ్రామానికి చెందిన అవిశినేని లక్ష్మీదేవి (45) పొలంలో చిక్కుడుకాయలు కోస్తుండగా కాలుపై పాము కాటు వేసింది. వెంటనే గ్రామస్తులు అదే గ్రామానికి చెందిన పాము కాటుకు మందులు ఇచ్చే నాటు వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లారు.
పరిస్తితి విషమించడంతో 108 అంబులెన్స్ లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే లక్ష్మీదేవి మృతి చెందినట్లు వైద్యులు పరీక్షించి తెలిపారు. జరిగిన ఘటనపై సమాచారాన్ని అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీదేవి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story




