Yerragondapalem: యర్రగొండపాలెం జాతీయ రహదారిపై కారు బీభత్సం!
Yerragondapalem: యర్రగొండపాలెం మెట్టబోడు తండా వద్ద ఘోర ప్రమాదం. స్కూటీని ఢీకొట్టిన వేగంగా వచ్చిన కారు. ఐదేళ్ల బాలుడు రియాన్ దుర్మరణం, తండ్రికి తీవ్ర గాయాలు.
Yerragondapalem: యర్రగొండపాలెం జాతీయ రహదారిపై కారు బీభత్సం!
Yerragondapalem: యర్రగొండపాలెం మండలం మెట్టబోడు తాండ వద్ద జరిగింది. ముందు వెళుతున్న స్కూటీ ని కారు వెనుక నుండి వేగంగా ఢీ కొట్టడంతో స్కూటీ పై ఉన్న తండ్రి కొడుకు లలో, ఐదేళ్ళ అత్తోట రియాన్ స్పాట్ లోనే మృతి చెందాడు. అతడి తండ్రి రత్నరాజు కు తీవ్ర గాయాలు కావడంతో యర్రగొండపాలెం లోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం తోనే ఈ ప్రమాదం జరగడం వలన ఐదేళ్ళ పాల బుగ్గల పసివాడైన రియాన్ మృతి చెందాడు.
కొడుకు మృతి తోపాటు భర్త కు తీవ్ర గాయాలు అయిన విషయం తెలుసుకున్న రమ్య మానసా కుప్పకూలి అదే వైద్యశాలలో చికిత్స పొందుతుంది. దీంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాదం పై కేసు నమోదు చేసిన ఎస్సై దేవకుమార్, రియాన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Next Story




