Anandapuram: అప్పుల బాధ తాళలేక యువకుడి ఆత్మహత్య!

Anandapuram: ఆనందపురం మండలం సొంఠ్యాం జగనన్న కాలనీలో అప్పుల బాధతో యువకుడు ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య.

SHIVA, BHIMILI
Published on: 25 July 2026 11:14 AM IST
Anandapuram
X

Anandapuram: అప్పుల బాధ తాళలేక యువకుడి ఆత్మహత్య!

Anandapuram: అప్పుల బాధతో మనస్తాపానికి గురై ఓ యువకుడు ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆనందపురం మండలం సొంఠ్యాం పంచాయతీ జగనన్న కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

​పోలీసుల కథనం ప్రకారం... జగనన్న కాలనీకి చెందిన కోరుకొండ హేమంత్ కుమార్(27) గతంలో ట్రావెల్స్ నిర్వహించేవాడు. ప్రస్తుతం ఉపాధి లేకపోవడం,అప్పుల భారం పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు.తలుపు తీసిన తల్లి అప్పలకొండ ఉరివేసుకొని ఉన్న కుమారుడిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.హేమంత్ తండ్రి ఈశ్వరరావు,​సమాచారం అందుకున్న ఆనందపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story