Rayadurgam: రాయదుర్గంలో యువకుడి ఆత్మహత్య కలకలం!

Rayadurgam: రాయదుర్గంలో ప్రేమ వ్యవహారం, పెళ్లి ఒత్తిడి కారణంతో మంజు అనే యువకుడు సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 7 Sept 2026 12:43 PM IST
Rayadurgam
X

Rayadurgam: రాయదుర్గంలో యువకుడి ఆత్మహత్య కలకలం!

Rayadurgam: రాయదుర్గం పట్టణంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. రాయదుర్గం అర్బన్ సీఐ దేవానంద్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపురం లేఅవుట్‌లోని 17వ నంబర్ ఇంట్లో నివాసం ఉంటున్న మంజు అనే యువకుడు సోమవారం రాత్రి సుమారు 11:30 నిమిషాలకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆత్మహత్యకు ముందు “నా చావుకు ఎవరూ కారణం కాదు” అంటూ వీడియోను రికార్డు చేసి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మంజు ఓ యువతిని ప్రేమిస్తున్నాడని, ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరినట్లు సమాచారం.

అయితే పెళ్లి విషయమై యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని తెలుస్తోంది. మరోవైపు తనకు పెళ్లి చేయాలని మంజు తల్లిపై కూడా ఒత్తిడి తెస్తుండేవాడని, ప్రస్తుతం ఎలాంటి పని చేయకుండా ఉంటే ఎలా పెళ్లి చేయాలని ఆమె చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలోనే సోమవారం రాత్రి మంజు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. సమాచారం అందుకున్న రాయదుర్గం అర్బన్ సీఐ దేవానంద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM

Next Story