AP ICET Results 2026: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల.. 91.41% పాస్, డైరెక్ట్ లింక్ ఇదే!
AP ICET Results 2026: ఏపీ ఐసెట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. 91.41% శాతం ఉత్తీర్ణతతో విడుదలైన ఈ ఫలితాల ర్యాంక్ కార్డ్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో చూడండి.
AP ICET 2026 Results
AP ICET Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన AP ICET-2026 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది ఐసెట్ పరీక్షలో రికార్డు స్థాయిలో 91.41 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.
ఈ పరీక్ష ఫలితాలు, ర్యాంక్ కార్డులు ప్రస్తుతం ఉన్నతాధికార విద్యామండలి (APSCHE) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు.
AP ICET 2026 ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
విద్యార్థులు క్రింది సాధారణ స్టెప్స్ ఫాలో అయి తమ ఫలితాలను చూసుకోవచ్చు:
స్టెప్ 1: మొదట అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ICET ను సందర్శించండి.
స్టెప్ 2: హోమ్‌పేజీలో కనిపించే "Download Rank Card" లేదా "Results" లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు ఐసెట్ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
స్టెప్ 4: వివరాలు కరెక్ట్‌గా చూసుకుని "Submit" లేదా "Get Results" బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 5: మీ ఏపీ ఐసెట్ ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్టెప్ 6: కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం దానిని డౌన్‌లోడ్ చేసుకుని, ఒక ప్రింటవుట్ కాపీని దగ్గర ఉంచుకోండి.




