AP SSC Results 2026: రేపే ఏపీ పదో తరగతి ఫలితాలు...వాట్సాప్‌లో ఇలా చెక్ చేసుకోండి.!
ఏపీ 10వ తరగతి ఫలితాలు రేపు విడుదల. వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా సులభంగా ఎలా చెక్ చేసుకోవాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
AP SSC Results 2026
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థుల కోసం కీలక అప్డేట్ వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను రేపు (ఏప్రిల్ 30) విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు ఏపీ SSC పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే ఫలితాల విడుదలకు సంబంధించి అన్ని సాంకేతిక ఏర్పాట్లు పూర్తయ్యాయి.
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://results.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇతర విద్యా వెబ్‌సైట్లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
సర్వర్లు బిజీగా ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు అందించే ఏర్పాట్లు చేసింది. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కు “Hi” అని మెసేజ్ పంపితే సూచనలు వస్తాయి. ఆ తర్వాత హాల్ టికెట్ నంబర్, జన్మతేదీ వంటి వివరాలు నమోదు చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
అలాగే ఫలితాలను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకుని ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
విద్యార్థులు ఆందోళన చెందకుండా అధికారిక మార్గాల ద్వారానే ఫలితాలను చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.




