CBSE 10th Result 2026: విద్యార్థులకు అలర్ట్.. రేపే సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు?

CBSE 10th Result 2026: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు రేపు (ఏప్రిల్ 14) విడుదలయ్యే అవకాశం ఉంది.

Arun Chilukuri
Published on: 13 April 2026 4:42 PM IST
CBSE 10th Result 2026
X

CBSE 10th Result 2026: విద్యార్థులకు అలర్ట్.. రేపే సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు?

CBSE 10th Result 2026: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి ఫలితాలు రేపు, అంటే ఏప్రిల్ 14న విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన నేడు సాయంత్రం వెలువడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరిగిన ఈ పరీక్షలకు సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు ఈ క్రింది అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా తమ మార్కులను చూసుకోవచ్చు:

results.cbse.nic.in

cbse.nic.in

www.cbse.gov.in

వెబ్‌సైట్‌లతో పాటు డిజిలాకర్ (DigiLocker) మరియు ఉమాంగ్ (UMANG) యాప్‌ల ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. ఫలితాల కోసం విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ మరియు పుట్టిన తేదీ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

ఈ ఏడాది నుంచి కొత్త విధానం:

సీబీఎస్ఈ ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల కోసం కీలక మార్పులు చేపట్టింది.

రెండో విడత పరీక్షలు: మార్కులను మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థుల కోసం బోర్డు సెషన్-2 పరీక్షలను నిర్వహించనుంది. గరిష్టంగా మూడు సబ్జెక్టులలో ఇంప్రూవ్‌మెంట్ రాసే అవకాశం ఉంది.

ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు: ఈ పరీక్షలు మే 15 నుంచి ప్రారంభం కానున్నాయి.

గ్రేస్ మార్కులు: ఒకటి లేదా రెండు మార్కులతో ఫెయిల్ అయ్యే విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపి ఉత్తీర్ణత సాధించేలా బోర్డు వెసులుబాటు కల్పించనుంది.

ఉత్తీర్ణత మార్కులు: పాస్ అవ్వడానికి ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించాలి.

12వ తరగతి ఫలితాలు ఎప్పుడు?

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు మే నెల రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 12వ తరగతి పరీక్షలు ఇటీవలే ఏప్రిల్ 10న ముగిశాయి. 10, 12 తరగతులు కలిపి ఈ ఏడాది మొత్తం 43 లక్షల మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story