CBSE 10th Results 2026: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!

CBSE 10th Results 2026: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు నేడు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ results.cbse.nic.in లో చెక్ చేసుకోవచ్చు.

Arun Chilukuri
Published on: 15 April 2026 4:40 PM IST
CBSE 10th Results 2026
X

CBSE 10th Results 2026: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!

CBSE 10th Results 2026: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి ఫలితాలను నేడు విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుండి మార్చి 11 వరకు జరిగిన పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మే నెలలో రెండో విడత (Phase 2) పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున, బోర్డు ముందస్తుగానే తొలి విడత ఫలితాలను వెల్లడించింది.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది వెబ్‌సైట్లు మరియు యాప్‌ల ద్వారా పొందవచ్చు:

అధికారిక వెబ్‌సైట్: results.cbse.nic.in లేదా cbse.gov.in

యాప్స్: డిజీలాకర్ (DigiLocker) మరియు ఉమాంగ్ (UMANG).

స్టెప్స్ ఇవే:

వెబ్‌సైట్‌ను సందర్శించి 'Secondary School Examination (Class X) 2026 Results' పై క్లిక్ చేయాలి.

మీ రోల్ నంబర్ (Roll Number), స్కూల్ నంబర్ (School Number), అడ్మిట్ కార్డు ఐడీ (Admit Card ID) మరియు పుట్టిన తేదీ (DOB) వివరాలను నమోదు చేయాలి.

'Submit' బటన్ నొక్కగానే మీ స్కోర్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story