CBSE 10th Result 2026: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు.. ఏ క్షణంలోనైనా విడుదలయ్యే ఛాన్స్!

CBSE 10th Result 2026: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు 2026 ఏప్రిల్ 15 లేదా 16న విడుదలయ్యే అవకాశం ఉంది.

Arun Chilukuri
Published on: 15 April 2026 3:31 PM IST
CBSE 10th Result 2026
X

CBSE 10th Result 2026: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు.. ఏ క్షణంలోనైనా విడుదలయ్యే ఛాన్స్!

CBSE 10th Result 2026: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలు ఏ క్షణంలోనైనా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది మే నెలలో రెండో విడత పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున, ఏప్రిల్ మూడో వారంలోనే ఫలితాలను ప్రకటించేలా బోర్డు కసరత్తు చేస్తోంది.

ఫలితాలను ఎక్కడ చూడాలి?

విద్యార్థులు తమ మార్కులను ఈ క్రింది వెబ్‌సైట్లు మరియు మొబైల్ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు:

అధికారిక వెబ్‌సైట్లు: www.cbse.gov.in, results.cbse.nic.in

మొబైల్ యాప్స్: డిజీలాకర్ (DigiLocker), ఉమాంగ్ (UMANG).

చెక్ చేసుకునే విధానం:

పైన పేర్కొన్న ఏదైనా వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

హోమ్ పేజీలో 'CBSE Class 10th Result 2026' లింక్‌పై క్లిక్ చేయాలి.

మీ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు ఐడీ, మరియు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.

సబ్మిట్ బటన్ నొక్కగానే మీ మార్కుల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది.

భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాలను డౌన్‌లోడ్ లేదా ప్రింట్ తీసుకోవాలి.

గత రెండేళ్లుగా మే 13న ఫలితాలు విడుదల చేసిన బోర్డు, ఈసారి పరీక్షలను ముందుగానే ముగించడంతో ఫలితాలను కూడా త్వరగా అందించేందుకు మొగ్గు చూపుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story